Logo
Date of Publish : 03 July 2026, 7:22 am
Editor : Shankaragallu Venkatesulu

గాదె సాయికృష్ణ కేసులో సంచలన విషయాలు.

 

గాదె సాయికృష్ణ కేసులో సంచలన విషయాలు.

కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కీలక ఆధారాలు గుర్తించిన సిట్

విజయవాడ, జూలై 3 (అనంతజనశక్తి న్యూస్):

గాదె సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కీలక ఆధారాలను గుర్తించింది.దర్యాప్తులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మరకలను సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అలాగే పోలీస్ స్టేషన్ టెర్రస్‌పై ఎముకలు, బూడిద ఆనవాళ్లు లభ్యమైనట్లు వెల్లడైంది.అదే ప్రాంతంలో కాలిన హ్యాండ్ గొలుసుతో పాటు ఒక లాఠీని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు తెలిసింది.ప్రాథమిక దర్యాప్తులో గాదె సాయికృష్ణ పోలీసు కస్టడీలో తీవ్ర గాయాలకు గురై మృతి చెందినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని ఆధారాల సేకరణ కొనసాగుతుండగా, దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)