Logo
Date of Publish : 19 November 2025, 8:38 am
Editor : Shankaragallu Venkatesulu

సత్యసాయి ప్రేమ శాశ్వతం… సేవే పరమధర్మం : ప్రధాని మోదీ

సత్యసాయి ప్రేమ శాశ్వతం… సేవే పరమధర్మం : ప్రధాని మోదీ

శ్రీ సత్యసాయి జిల్లా (పుట్టపర్తి):అనంత జనశక్తి న్యూస్

పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి జయంత్యుత్సవాలు వైభవంగా నిర్వహించగా, కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంగా స్పందించారు. “ఎందరో మహానుభావులు… అందరికీ వందనములు” అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రారంభించారు.

“జయంత్యుత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం” — మోదీ

సత్యసాయి భౌతికంగా లేకున్నా, ఆయన ప్రేమ ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. “సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం నాకు గొప్ప అదృష్టం” అని పేర్కొన్నారు.

సత్యసాయి – విశ్వప్రేమకు ప్రతిరూపం

సత్యసాయి జీవితం మొత్తం మానవసేవకే అంకితం అయిందని, ఆయన బోధనలు దేశమంతా ప్రభావం చూపుతున్నాయని ప్రధాని అన్నారు.“భక్తి, జ్ఞానం, కర్మ ఆ మూడు సేవతోనే ముడిపడి ఉన్నాయి. సేవే పరమధర్మం అని భారతీయ నాగరికత చెప్పింది” అని వివరించారు.

“అందరినీ ప్రేమించు… అందరినీ సేవించు” – బాబా నినాదం

బాబా చెప్పిన ఈ నినాదం లక్షలాదిమంది జీవితాలను మార్గనిర్దేశం చేసిందని ప్రధాని గుర్తుచేశారు.దేశవ్యాప్తంగా కోట్ల మంది సత్యసాయి భక్తులు నిత్యం సేవచేస్తూ బాబా చూపిన దారిలో నడుస్తున్నారని పేర్కొన్నారు.

బాబా బోధనలు – కోట్ల మందికి మార్గదర్శకం

సత్యసాయి బోధనలు అనేక జీవితాలను సమూలంగా మార్చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.‘ప్రేమ, కరుణ, సేవ’ అనే ఆయన సూత్రాలు నేటికీ సమాజాన్ని సానుకూల దిశగా నడిపిస్తున్నాయని చెప్పారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)