Logo
Date of Publish : 15 September 2025, 4:46 am
Editor : Shankaragallu Venkatesulu

పదవులను బాధ్యతగా భావించాలి : మంత్రి నారాయణ

పదవులను బాధ్యతగా భావించాలి : మంత్రి నారాయణ

నామినేటెడ్ పదవులు పొందిన వారికి మంత్రి సూచన

మంత్రి నారాయణకు ఘనంగా సత్కరించిన టీడీపీ నాయకులు

మీ సహకారంతోనే పదవి, థాంక్యూ మంత్రి : ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్న మంత్రి నారాయణ

నెల్లూరు సెప్టెంబర్ 14,అనంత జనశక్తి న్యూస్

ఇటీవల నెల్లూరులో నామినేటెడ్ పదవులు పొందిన వారికి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న కొందరు మంత్రిని కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని వారికి మంత్రి సూచించారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామని వెల్లడించారు.. సమర్థత చాటిన బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చామన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నాయకుడికి సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో పదవులు దక్కించుకున్న కప్పిర శ్రీనివాసులు, ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, ఆంద్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రి నారాయణకు పూల బొకేలతో, శాలవలతో ఘనంగా సత్కరించి.. కృతజ్ఞతలు తెలిపారు.. మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని వారు మంత్రికి హామీ ఇచ్చారు.. సిటీ డివిజన్ పార్టీ కార్యకర్తలతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించి.. కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసారు.. ప్రజలకు ఎల్లప్పుడూ కార్యకర్తలు అందుబాటులో ఉండాలని మంత్రి నారాయణ సమీక్షలో పేర్కొన్నారు. అనంతరం టిడిపి సీనియర్ నాయకుడు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని నూతనంగా నామినేటెడ్ పదవులు పొందిన పలువురు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సివిల్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత విజయ భాస్కర్ రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు ,మాజీ జడ్పీటీసీ విజేత రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)