Logo
Date of Publish : 08 November 2025, 11:30 pm
Editor : Shankaragallu Venkatesulu

నాసిరకంరోడ్లు….అడిగేవారేరీ

నాసిరకంరోడ్లు....అడిగేవారేరీ

అధికారులు నిర్లక్ష్యం పై అనుమానాలు...

చిలమత్తూరు నవంబర్ 8 అనంత జనశక్తి న్యూస్

మండల కేంద్రంలో చిలమత్తూరు పంచాయితీలో జాతీయ రహదారి ఈ 544ఈ నుండి తుమ్మలకుంట వరకూ 50 లక్షల నిధులతో వేస్తున్న సీసీ రహచారి నాసిరకంగా నిర్మిస్తున్నారు. ఆరు ఇంచీలు వేయాల్సిన వెట్ మిక్స్ కేవలం మూడు ఇంచీలు మాత్రమే వేసి రోడ్డు నిర్మిస్తున్నారు. సాధారణంగా ఆరు ఇంచీలు వెట్ మిక్స్ వేసి రోలింగ్ చేయాలి. దానిని మూడు నుండి నాలుగు ఇంచీలు కు తీసుకువస్తారు. నిభందనలు కూడా ఇవే. కానీ టీడీపీ కి చెందిన ఓ కాంట్రాక్టర్ కాసులకు కక్కర్తి పడి మూడు ఇంచీలు వేసి రోలింగ్ చేయడంతో అదికాస్త రెండు ఇంచీలకు మాత్రమే వచ్చింది. రోడ్డుకు తోలిన వెట్ మిక్స్ కూడా తేమ లేకుండానే ఉండటం, రోడ్డుకు ఇరువైపులా మట్టి వేసి మధ్యలో ఈ మిక్స్ వేయాల్సి ఉంది. అలాంటిదేమీ లేకుండా తమకు నచ్చినట్లు రోడ్డు వేస్తున్నారు. అధికారులను వివరణ కోరితే నిభందనల ప్రకారమే వేస్తున్నారని, కేవలం మూడు ఇంచీలు వెట్ మిక్స్ వేయాలని తామే సూచించామని, నిభందన కూడా అంతే అంటూ మాట్లాడటం గమనార్హం. బాధ్యతగా మెలగాల్సిన అధికారులు కనీసం ఎలా వేస్తున్నారని కనీసం పరిశీలన కూడా చేయకుండా ఉండటం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అభివృద్ధి లో అన్ని కోట్లు ఇన్ని కోట్లు అబివృద్ధి పనులు చేస్తున్నామని గొప్పలు పోయే కూటమి ప్రభుత్వం, తమ సొంత నేతల కేబులు నింపేందుకు అభివృద్ది నిధులు తె స్తున్నారా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాసిరకంగా రోడ్లు వేయడం. అవే అభివృద్ధిగా చూపడం కూటమి నేతలకే చెల్లిందంటూ ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)