Logo
Date of Publish : 09 December 2025, 4:29 am
Editor : Shankaragallu Venkatesulu

క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం వహించండి

క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం వహించండి

కాన్వా సిసిఎస్ఓ రోబ్ గిగిలియోతో మంత్రి లోకేష్ భేటీ

శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): కాన్వా (Canva) ఛీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మాట్ లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూ.65వేల కోట్ల వ్యయంతో అమరావతి రాజధాని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎంటర్ టైన్ మెంట్ సిటీని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని కోరారు. కాన్వా సిసిఎస్ ఓ రాబ్ గిగిలియో మాట్లాడుతూ... ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీజింగ్, మనీలా, ఆస్ట్రిన్ లలో ప్రధాన కార్యాలయాలు కలిగి విస్తృతమైన రిమోట్ వర్క్ ఫోర్స్ తో పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రెజెంటేషన్లు, సోషల్ మీడియా గ్రాఫిక్స్, డాక్యుమెంట్లు, పోస్టర్లు, వీడియోల తయారీకి సరళీకృతమైన, క్లౌడ్-ఆధారిత డిజైన్ ప్లాట్‌ఫామ్ లను కాన్వా అందిస్తుందని అన్నారు. తమ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. (కాన్వా సంస్థ $40 బిలియన్ల మార్కెట్ క్యాపిటైజేషన్ తో గత ఏడాది $2.5 బిలియన్ల వార్షికాదాయం సాధించింది).


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)