Logo
Date of Publish : 06 March 2026, 4:34 am
Editor : Shankaragallu Venkatesulu

జనాభా సమతుల్యత కోసం కొత్త ప్రోత్సాహకాలు

జనాభా సమతుల్యత కోసం కొత్త ప్రోత్సాహకాలు –

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సాయం

అమరావతి మార్చి 06, అనంత జనశక్తి న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిపోతున్న జనన రేటును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జనాభా విధానాన్ని రూపొందిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 5, 2026న అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేశారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు పలు ప్రోత్సాహకాలను అందించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.ప్రసవ సమయంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు ₹25,000 నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో బిడ్డ లేదా ఆపై సంతానం జన్మించిన తర్వాత ఆ బిడ్డ పోషణ కోసం ఐదేళ్ల పాటు ప్రతి నెల ₹1,000 ఆర్థిక సాయం అందించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అదేవిధంగా ఆ పిల్లలకు 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ప్రభుత్వ ఉద్యోగుల కోసం కూడా ప్రత్యేక సడలింపులు ప్రకటించారు. రెండవ బిడ్డ జన్మించినప్పుడు తల్లిదండ్రులైన ప్రభుత్వ ఉద్యోగులకు ఒక నెల అదనపు సెలవు ఇవ్వనున్నారు. మూడవ బిడ్డ జన్మిస్తే మరో నెల అదనపు సెలవు మంజూరు చేసేలా ప్రతిపాదించారు. అదనంగా రెండవ బిడ్డ పుట్టినప్పుడు పురుష ఉద్యోగులకు ఒక నెల పితృత్వ సెలవు (Paternity Leave) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉన్న “ఇద్దరు పిల్లల పరిమితి” నిబంధనను ప్రభుత్వం తొలగించింది. అలాగే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులపై ఉన్న పరిమితులను కూడా ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సంతానోత్పత్తి రేటు (TFR) 1.5 నుండి 2.1కి పెంచడమే లక్ష్యంగా ఈ నూతన జనాభా విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)