Logo
Date of Publish : 08 November 2025, 11:41 pm
Editor : Shankaragallu Venkatesulu

మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే దగ్గుపాటి కృతజ్ఞతలు

మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే దగ్గుపాటి కృతజ్ఞతలు

ఆర్టీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ హామీ ఇవ్వడంపై హర్షం

భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి

కురుబ కులస్తులకు వరాలు జల్లు కురిపించారన్న ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం నవంబర్ 08, అనంత జనశక్తి న్యూస్

ఆర్డిటి సంస్థకు ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ కోసం కృషి చేసిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం కళ్యాణదుర్గం లో జరిగిన భక్త కనకదాసు జయంతి ఉత్సవంలో ఆయన మంత్రి నారా లోకేష్ తో పాటు సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, టిడిపి నాయకులతో కలసి పాల్గొన్నారు. భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప తత్వవేత్త, సంఘసంస్కర్త అయిన కనకదాసు జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేలా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకున్నారన్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బీసీల పక్షాన ఉంటుందన్నారు. కురుబలు ఆర్థికంగా సామాజికంగా ప్రాధాన్యత కల్పించారన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ పాదయాత్రలో భక్త కనకదాసు జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగ నిర్వహిస్తామని ఆరోజే హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం భక్త కనకదాసు రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గుడికట్ల పూజారులకు గౌరవవేతనం ఇస్తామని చెప్పడంపై ఎమ్మెల్యే దగ్గుపాటి హర్షం వ్యక్తం చేశారు. అలాగే వారికి మరిన్ని హామీలు ఇచ్చారన్నారు. ఆర్డిటి సంస్థకు ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ తీవ్రమైన సమస్యగా మారిన సమయంలో మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకున్నారన్నారు. ఇప్పుడు ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ తో పాటు ఆ సంస్థకు మరింత ప్రోత్సాహం ఇస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం సేవ చేసేవారికి, పేదల పక్షాన నిలబడుతుందని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)