Logo
Date of Publish : 23 November 2025, 5:20 am
Editor : Shankaragallu Venkatesulu

పుట్టపర్తిలో మంత్రి నారా లోకేష్ 74వ రోజు ప్రజాదర్బార్

పుట్టపర్తిలో మంత్రి నారా లోకేష్ 74వ రోజు ప్రజాదర్బార్

ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి

సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని హామీ

పుట్టపర్తి నవంబర్ 23, అనంత జనశక్తి న్యూస్

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంప్ సైట్ లో ఉదయం 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్... ఆయా సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని, విచారించి అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామానికి చెందిన డి.లోకేష్ విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్న తాను.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నానని, సాయం అందించి అండగా నిలవాలని బుక్కపట్నంకు చెందిన గాజుల రామాంజనేయులు విన్నవించారు. సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి గ్రామంలో తాను కొనుగోలు చేసిన రెండున్నర సెంట్ల ఇంటి స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వ అండతో హనుమంతరెడ్డి ఆక్రమించారని, విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని ముదిగుబ్బ మండలం మాకర్లకుంటపల్లికి చెందిన టి.నాగభూషణం మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎంఏ బీఈడీ చదివిన తనకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని పుట్టపర్తికి చెందిన ఎన్.జయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)