Logo
Date of Publish : 05 March 2026, 3:08 am
Editor : Shankaragallu Venkatesulu

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

నిందితుల ఆస్తుల జప్తుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అమరావతి"అనంతజనశక్తి న్యూస్"

ఆంధ్రప్రదేశ్లో  సంచలనం రేపిన లిక్కర్ కేసులో కీలక ముందడుగు పడింది. కేసులో A8గా ఉన్న బూనేటి చాణక్యకు చెందిన ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.సుమారు రూ.11.29 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను అటాచ్ చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నేడు సంబంధిత కోర్టులో అటాచ్‌మెంట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.అక్రమ లావాదేవీలు, నిధుల మళ్లింపుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతి లభించిన వెంటనే ఆస్తుల జప్తు ప్రక్రియ చేపట్టనున్నారు.ఈ పరిణామం కేసులో మరిన్ని కీలక మలుపులకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)