Logo
Date of Publish : 03 December 2025, 12:55 pm
Editor : Shankaragallu Venkatesulu

డిసెంబర్ 4న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం

డిసెంబర్ 4న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం

కార్తీక పౌర్ణమి గరుడ సేవ రద్దు

తిరుమల డిసెంబర్ 03 అనంత జనశక్తి న్యూస్

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి సందర్బంగా సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన తర్వాత ఈ ప్రత్యేక దీపోత్సవం జరుగనుంది.ఈ నేపథ్యంలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవ అలాగే సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.టీటీడీ ప్రకారం సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి, ఛత్రచామర, మంగళవాయిద్యాలతో శ్రీవారిని ఊరేగింపుగా విమాన ప్రదక్షిణ చేయనున్నారు. అనంతరం ఆనంద నిలయంలో హారతి సమర్పిస్తారు.దీంతో పాటు గర్భాలయం నుంచి ప్రారంభించి వరుసగా అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభఅర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనుల సన్నిధి, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్రపాలకులు, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వరకు దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)