ప్రాచీన సాంప్రదాయాలు, ఆచారాలు, హస్త కళలకు పుట్టినిల్లు భారతదేశ
ప్రతి ఒక్కరూ ప్రాచీన సాంప్రదాయాలు, హస్త కళలను కాపాడాలి
తొలుబొమ్మల కళకు జీవం పోశారంటూ ప్రశంశించిన కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్
ధర్మవరం- సెప్టెంబరు,20: అనంత జనశక్తి న్యూస్
ప్రాచీన సాంప్రదాయాలు, హస్త కళలకు భారతదేశం పుట్టినిల్లు అని ప్రతి ఒక్కరూ బాధ్యతగా సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శాంప్రసాద్ అన్నారు.శనివారం ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో ప్రసిద్ధ తోలుబొమ్మలాట కళాకారుడు పద్మశ్రీ దలవాయి చలపతి రావు ఇంటిని సందర్శించిన కలెక్టరు..ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తోలుబొమ్మలాట కళాకారుడు దలవాయి చలపతిరావు తో మాట్లాడుతూ ఈ కళ నీకు ఎలా వచ్చిందని ఎప్పటినుండి ఈ కళను చేస్తున్నారని మరియు తొలుబొమ్మలును ఎలా తయారు చేసే వారు అని ఎటువంటి రంగులు వాడేవారు అని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పూర్వం ఈ తోలుబొమ్మలాట బొమ్మల వల్ల పురాణాలను చెప్పేవారమని కళాకారుడు దలవాయి చలపతిరావు కలెక్టర్ కు విన్నవించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత తోలుబొమ్మలాట కళాకారుడుతో తోలుబొమ్మలాటకు ప్రత్యేకత తీసుకురావడంలో దలవాయి చలపతి పాత్ర మరువలేనిదని అన్నారు. వారు చేసిన తొలుబొమ్మలును పరిశీలించారు. ధర్మవరం ఆర్డీవో మహేష్ పాల్గొన్నారు.