ఐసీడీఎస్ సొమ్మొకరిది సోకొకరిది
-ప్రాపకం కోసం ఆ శాఖ అధికారిని ఆడంబరాల
వేడుక...
-16 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఏర్పాట్లు
-ఆర్థికంగా బలైపోతున్న అంగన్వాడీలు
-నోరెత్తితే సస్పెండ్ చేస్తానని బెదిరింపులు
-పర్సులు ఖాళీ చేసుకొని సమకూరుస్తున్న వస్తువులు
ధర్మవరం మార్చి 14, అనంత జనశక్తి న్యూస్ :
ధర్మవరం కొందరు అధికారిని లు ఇతరులను ఫణంగా పెట్టుకొని మంత్రులు ప్రజాప్రతినిధుల వద్ద మార్కులు కొట్టేయడానికి ఎంతకైనా తెగిస్తుంటారు. అందుకు ఏమాత్ర తీసిపోరు ధర్మవరం ఐసీడీఎస్ లోని అధికారిని. గతంలో కూడా ఇక్కడ పనిచేసిన ఈ అధికారిని క్యాంపులు, విజిటింగ్ పేరుతో అంగన్వాడీలను ఆర్థికంగా ముప్పుతిప్పలు పెట్టు మూడుచెరువుల నీరు తాపించారన్న విమర్శలు మరువకనే ఒక్క పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టేందుకు పెద్ద పన్నాగానికి తెరలేపినట్లు సమాచారం. గతంలో సూపర్వైజర్ గా ధర్మవరంలో పనిచేసినప్పుడు విసిట్ పేరుతో అంగన్వాడీలనుండి పట్టు చీర, స్వీట్స్, ఇవ్వాల్సిందే లేదంటే ఆ సెంటర్ కు ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం అదే సెక్టార్ కు ఇన్చార్జి సీడీపీఓ గా వచ్చిన ఆ మేడం ఇంకేమి ఆర్థిక కష్టాలు తెచ్చి పెడుతుందో నని భయపడుతుండగానే ఆ సమయం తీసుకురానే వచ్చింది. ఆ మేడం మంత్రి వద్ద మార్కులు కొట్టేసి పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టేందుకు అంగన్వాడీలను పావులుగా వాడుతోంది. దీంతో ఆ మేడం మార్కులు కొట్టేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు తమ పర్సులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్తితి రావడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మేడం నిర్వాకం చూసి సొమ్మొకరిది.... సోకొకరిది అనే నానుడి ఆ శాఖ వర్గాల ద్వారా వ్యక్తమవడం విశేషం.
ఆ వస్తువులను సమకూర్చాల్సిందే.....
మనం జరిపేది జాతీయ మహిళా దినోత్సవం..... ఈ దినోత్సవాన్ని ధర్మవరం టిటిడి కళ్యాణ మండపలో ఏర్పాటు చేస్తున్నాం ..అందులోనూ మంత్రి పాల్గొంటున్నారు... మన ఏర్పాట్లను చూసి మంత్రి మురిసిపోవాలి... ఆయనతో మనం కూడా శభాష్ అనిపించుకోవాలి.... అందుకు నిధులు (డబ్బులు) మీరే భరించి ఎక్కడ దొరకని వస్తువులను సైతం ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను మీ అందరిదే.. అంటూ ఆ అధికారిని ముఖం జారీ చేయడంతో అంగన్వాడీల మొహాలు పాలిపోయే పరిస్థితి ఏర్పడింది. అసలే అరకొర జీతంతో పనిచేస్తున్న అంగన్వాడీలకు ప్రతినెల ఏదో రూపంలో అదనంగా ఖర్చు పెట్టిస్తుండడంతో మింగుడు పడని పరిస్థితి వారిలో నెలకొంది. చేసేదిలేక పనులు అంగన్వాడి సెంటర్లను సైతం వదిలేసి తమకు అప్పజెప్పిన వస్తువులను సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు.
సూపర్వైజర్లకు హుకుం జారీ....
సోమవారం జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని పలువురు సూపర్వైజర్లకు సీడీపీఓ హుకుం జారీ చేసినట్లు సమాచారం. కార్యక్రమం విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా సూచించినట్లు సమాచారం. ఈ మహిళ దినోత్సవం ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించారో లేదో తెలియదు గాని అంగన్వాడీల నుంచి మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్న తీవ్ర విమర్శలు ఆ అంగన్వాడీల ద్వారా వ్యక్తమవుతోంది. ఎప్పుడో మహిళా దినోత్సవం ఇస్తే ఆ మేడం స్వార్థం కోసం మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులు గురిచేస్తుందంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఊసూరుమంటున్నారు.
సొమ్మొకరిది సోకొకరిది....
ధర్మవరం ఐసిడిఎస్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తే "రెడ్డి భవానం తలారి దుప్పటి అన్న చందంగా తయారయింది" అన్న విమర్శలు ఉన్నాయి. తాను అధికారినిగా మంత్రి వద్ద మంచి మార్కులు కొట్టేయడానికి అంగన్వాడీ కార్యకర్తలను ఫణంగా పెడుతున్నట్లు ఆ శాఖ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మేడం చేపట్టే ఆడంబరాలు, స్వార్థం కోసం ఒక్కొక్కరు 500 నుంచి 1000 రూపాయలు దాకా వెచ్చిస్తుండగా ఆ మేడం మాత్రం తమ పర్సులో నుంచి ఒక్క రూపాయి కూడా తీయకపోవడం చూస్తుంటే ఇక్కడ సొమ్ము ఒకడిది శోకకరిదిగా తయారైందని తొందర అంగన్వాడి కార్యకర్తలు బాహాటంగా తమ మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నేను చెప్పినట్టు చేయాల్సిందే లేదంటే సస్పెండే...
తాను చెప్పినట్లు చేయకపోయినా వినకపోయినా తోక జాడించిన సస్పెండ్ చేస్తానని నిత్యం హెచ్చరిస్తూ సెక్టర్ ను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేడం ఎక్కడ పని చేసినా వివాదాలు అక్రమాలకు కేంద్రబిందువుగా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఈ మేడం ఓడిసీలో పనిచేసినప్పుడు భారీ ఎత్తున అక్రమార్జనక పాల్పడినట్లు జిల్లా శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేడం ప్రస్తుతం పుట్టపర్తి ధర్మవరం సిడిపిఓగా పని చేస్తూ ఓడిసికి స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం
అంగన్వాడీల సిబంది పై మరో భారం? గర్భిణులకు శ్రీమంతం ఖర్చు అంగవాడి సెంటర్ భరించాలి....
ధర్మవరం ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తలపై మరో ఆర్థిక భారం ప్రతి అంగన్వాడీ సెంటర్ నుంచి నలుగురు గర్భిణి మహిళలను తీసుకువచ్చి వారికి శ్రీమంతం కార్యక్రమానికి అయ్యే ఖర్చును ఆయా సెంటర్ అంగన్వాడీ సిబ్బందే భరించాలన్న పరిస్థితి ఏర్పడింది సీడీపీఓ ఆదేశాల మేరకు సూపర్వైజర్లు ప్రతి సెక్టార్‌లోని అంగన్వాడీలు ఆయాలు భరించాల్సి వస్తుంది ఆవేదన వ్యక్తం చేశారు.సుమారు 230 సెక్టార్ నుంచి గర్భిణి మహిళలను తీసుకువచ్చి కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా, వారికి సంబంధించిన శ్రీమంతం ఖర్చులను ఆయా సెంటర్ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు భరించలిన్సివస్తుంది. అసలు జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే ఇది ఒక భారమని కలత చెందుతున్నారు. ఈ భాదలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థి నెలకొంటోంది
ఎగ్జిబిషన్ పేరుతో అంగన్వాడీల పై అదనపు భారం?....
ధర్మవరం ప్రాంతంలో నిర్వహించనున్న ఎగ్జిబిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి అంగన్వాడీ సెక్టార్ నుండి అందులో వివిధ రకాల ధాన్యాలు, మొలకెత్తిన రాగులు, సద్దలు, జొన్నలు వంటి ఆహార పదార్థాలను ప్రదర్శించాలని సూచించినట్లు తెలుస్తోంది.ఒక్కో కుండకు సుమారు రూ.100.... అలాగా 100 కుండలు ఎంత ఖర్చు అవుతుందో ఈ ఖర్చును ఆయా సెక్టార్‌ల అంగన్వాడీ సిబ్బందే భరించాల్సి వస్తోందని . దీంతో ఇప్పటికే తక్కువ వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల పై అదనపు ఆర్థిక భారం పడుతోంది ఇలాంటి కార్యక్రమాల కోసం మా జీతలో కోత ను భరించి పరిస్థి నెలకొంటుందని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు, నాయకులు అలోచించి ఈ పేద జీవితాలతో చెలగాట ఆడటం సరియైనది కాదని ఆవేదన వెక్తం చేస్తున్నారు ..