ఉమ్రా యాత్ర పేరిట భారీ మోసం
కర్నూలులో కలకలం
కర్నూలు మార్చి 27 అనంత జనశక్తి న్యూస్
ఉమ్రా యాత్ర పేరుతో జిల్లాలో భారీ మోసం వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. యాత్రకు పంపిస్తామని నమ్మబలికి ఓ ముఠా కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కర్నూలు పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి, ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.40 వేల చొప్పున వసూలు చేసి, వెయ్యి మందికి పైగా బాధితుల నుంచి మొత్తం దాదాపు రూ.4 కోట్లు దోచుకున్నట్లు సమాచారం. బాధితులు కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.డబ్బులు తీసుకున్న తర్వాత ఉమ్రా యాత్రకు పంపకుండా నిందితుడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో జిల్లాలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యాత్రల పేరుతో డబ్బులు చెల్లించే ముందు పూర్తి వివరాలు ధృవీకరించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.