Logo
Date of Publish : 20 September 2025, 9:40 am
Editor : Shankaragallu Venkatesulu

తెలుగు రాష్ట్రాల్లో 25 పార్టీలపై ఎన్నికల సంఘం వేటు

తెలుగు రాష్ట్రాల్లో 25 పార్టీలపై ఎన్నికల సంఘం వేట

ఏపీలో 17, తెలంగాణలో 8 పార్టీలను తొలగించిన ఎన్నికల సంఘం

తెలంగాణలో జయప్రకాశ్ నారాయణ్ లోక్‌సత్తా పార్టీపైనా వేటు

రెండు నెలల్లో మొత్తం 808 పార్టీల గుర్తింపు రద్దు

క్రియాశీలకంగా లేకపోవడమే ప్రధాన కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి

దేశవ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) స్థాపించిన లోక్‌సత్తా పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వేటు వేసింది. తెలంగాణలో ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని, నిబంధనలు పాటించని గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై ఈసీ చేపట్టిన ప్రక్షాళనలో భాగంగా ఈ చర్య తీసుకుంది.కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా దేశవ్యాప్తంగా 474 పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. వీటిలో ఏపీకి చెందిన 17 పార్టీలు, తెలంగాణకు చెందిన 8 పార్టీలు ఉన్నాయి. గత ఆరేళ్లుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం, పార్టీ కార్యాలయ చిరునామా, ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో ఈసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రద్దయిన పార్టీల జాబితాలో లోక్‌సత్తాతో పాటు ఆలిండియా ఆజాద్ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ వంటివి ఉన్నాయి.జయప్రకాశ్ నారాయణ్ లోక్‌సత్తా పార్టీకి షాక్‌!
రాజకీయాల్లో సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో జేపీ 2006లో లోక్‌సత్తా పార్టీని స్థాపించారు. 2009లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, 2014 తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న జేపీ, ప్రస్తుతం కేవలం చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ గుర్తింపు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.ఎన్నికల సంఘం ఈ ప్రక్షాళన ప్రక్రియను గత కొంతకాలంగా కొనసాగిస్తోంది. గత ఆగస్టు నెలలో కూడా 334 పార్టీలను ఇదే విధంగా జాబితా నుంచి తొలగించింది. దీంతో కేవలం రెండు నెలల వ్యవధిలోనే మొత్తం 808 పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లయింది. త్వరలోనే మరో 359 పార్టీలను కూడా తొలగించనున్నట్లు ఈసీ సంకేతాలిచ్చింది. వాటిలో ఏపీకి చెందిన 8, తెలంగాణకు చెందిన 10 పార్టీలు ఉండనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.తెలంగాణ నుంచి తొలగించిన పార్టీలు: ఆలిండియా ఆజాద్‌ పార్టీ, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత్‌ లేబర్‌ ప్రజాపార్టీ, లోక్‌సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్‌ నేషనల్‌ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి.ఏపీ నుంచి ఈసీ రద్దు చేసిన పార్టీలు: భారతీయ చైతన్య పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆలిండియా లిబరల్‌ పార్టీ, భారత్‌ ప్రజా స్పందన పార్టీ, ఆలిండియా మంచి పార్టీ, భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్‌ఆర్‌ బహుజన పార్టీ, గ్రేట్‌ ఇండియా పార్టీ, జై ఆంధ్రా పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ, ప్రజాపాలన పార్టీ, సమైక్య తెలుగురాజ్యం పార్టీ, రాయలసీమ కాంగ్రెస్‌పార్టీ, పొలిటికల్‌ ఎసెన్షియల్‌ అండ్‌ యాక్యురేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ పార్టీలు ఉన్నాయి.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)