Logo
Date of Publish : 03 July 2026, 7:19 am
Editor : Shankaragallu Venkatesulu

అనంతలో దొంగ నోట్ల తయారీ కలకలం.. ఇద్దరు అరెస్ట్

అనంతలో దొంగ నోట్ల తయారీ కలకలం.. ఇద్దరు అరెస్ట్

అనంతపురం, జూలై 3 ,అనంత జనశక్తి న్యూస్

అనంతపురంలో దొంగ నోట్ల తయారీ వ్యవహారం వెలుగులోకి రావడం కలకలం రేపింది. విజయవాడ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో దొంగ నోట్లు ముద్రిస్తున్న ఇద్దరు నిందితులు రాజు, సురేష్‌ను అరెస్టు చేశారు.పోలీసులు నిందితుల వద్ద నుంచి దొంగ నోట్ల ముద్రణకు ఉపయోగిస్తున్న ప్రింటింగ్ యంత్రాలు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిన అనంతరం నిందితులను తదుపరి విచారణ కోసం విజయవాడకు తరలించారు.ఈ వ్యవహారంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. దొంగ నోట్ల తయారీ ముఠాతో మరెవరైనా సంబంధం ఉన్నారా, ఈ నకిలీ నోట్లు ఎక్కడెక్కడ చలామణి అయ్యాయనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)