Logo
Date of Publish : 21 September 2025, 3:41 pm
Editor : Shankaragallu Venkatesulu

రేపు విశాఖకు సీఎం చంద్రబాబు

రేపు విశాఖకు సీఎం చంద్రబాబు

ఈ గవర్నెన్సు పై జాతీయ సదస్సులో పాల్గొనున్న సీఎం

విశాఖ, సెప్టెంబర్ 21: అనంత జనశక్తి న్యూస్

విశాఖలో జరుగనున్న 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఎలక్ట్రానిక్స్ , సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. “సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్” థీమ్ తో ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ లో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సైబర్‌ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి-స్టాక్ వంటి అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ సదస్సు కు హాజరై ప్రసంగించనున్నారు. విశాఖలోని నోవోటెల్ హోటల్ వేదిక గా జరుగునున్న ఈ సదస్సులో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.ఈ-గవర్నెన్స్‌లో ఉత్తమ ఆవిష్కరణలు, సముద్ర గర్భ కేబుల్స్, డేటా సెంటర్లు, గ్రామీణ స్థాయిలో ఈ-గవర్నెన్స్ ఆవిష్కరణలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు, సైబర్‌ సెక్యూరిటీ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ముగింపు కార్యక్రమంలో ‘విశాఖపట్నం డిక్లరేషన్ ఆన్ ఈ-గవర్నెన్స్ 2025’ ను కూడా ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం విశాఖ నుంచి అమరావతి చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శాసన సభలో సమావేశాల్లో పాల్గొనున్నారు. శాసన సభలో వ్యవసాయ రంగంపై లఘు చర్చలో పాల్గొని ప్రసంగించనున్నారు. శాసన సభ ముగిసిన అనంతరం విజయవాడ లోని వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)