వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.
ప్రతి ఎకరాకు నీరు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు
పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
ప్రతి నీటి బొట్టు విలువైనదే.
డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు సాగు చేసుకోండి
సత్యాసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్
పుట్టపర్తి నల్లమాడ 03, అనంత జనశక్తి న్యూస్
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజవర్గంలోని నల్లమాడ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ తో కలసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏటా 20,000 మంజూరులో భాగంగా ఇప్పటికే రెండు విడుదలగా 46 లక్షల 85 వేల మంది రైతులకు 6,310 కోట్లు వారి ఖాతాల్లో జమ అయిందని తెలిపారు. సత్య సాయి జిల్లాలో 2 లక్షల 65 వేల మంది రైతులకు రూ.178.76 కోట్లు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 44,348 రైతులకు రూ.62.87 కోట్లు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు.నల్లమాడ మండలంలోనే 16652 మంది రైతులకు రూ.11కోట్ల 66 లక్షలు రైతు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసినట్లు వెల్లడించారు.మనది వ్యవసాయాధారిత దేశమని సుమారు 60 శాతం మంది రైతులు వీటిపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ వంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని కొనియాడారు.నేడు రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించడానికి రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశ్యంతో రైతున్నా మీ కోసం కార్యక్రమం ద్వారా పంచ సూత్రాల కార్యక్రమాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇందులో నీటి భద్రత ,డిమాండ్ ఆధారిత పంటలు ,అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ ,ప్రభుత్వం నుంచి మద్దతు వంటి వాటిపై ప్రభుత్వం దృశ్య సాధించి దేశానికి రైతే రాజు చేయాలనే సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందన్నారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో డ్రిప్పు స్ప్రింకర్లు ఇతర రైతాంగానికి 90% రైతుతో అందిస్తోందన్నారు. సబ్సిడీపై మేలైన వంగడాలు ఎరువులు అందించి రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందించేలా మెరుగైన సాగునీటి విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం హంద్రీనీవా వంటి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయంలో రైతుకు పంట ఖర్చులు తగ్గించే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి మండలానికి ఒక డ్రోన్ సౌకర్యం తో పంటలకు మందు పిచికారి ఎరువులు వేసే పద్ధతిని తీసుకొచ్చారన్నారు. ముఖ్యంగా రైతులు సీజనకు తగ్గట్టుగా పంటల సాగు చేసుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూర సూచించారు. అధిక లాభాలు వస్తున్న మల్బరీ పూల సాగు పండ్ల తోటలు వాణిజ్య పంటలు సాగు చేసుకోవాలని రైతాంగాన్ని కోరారు. నల్లమాడ మండలం చెరువు వాండ్లపల్లికి చెందిన మహిళా రైతు వనజ ఎకరా మల్బరీ సాగు ద్వారా 23 రోజుల్లో లక్ష 40వేలు ఆదాయాన్ని పొంది ఇందులో రూ. 20వేలు ఖర్చులకు పోను మిగతా రూ.1,20,000 ఆదాయాన్ని సాధించినట్లు ఈ సందర్భంగా మహిళా రైతు ఈ సమావేశంలో చెప్పిన విషయాన్ని మిగతా రైతులు ఆచరించాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేకంగా కోరారు. రైతులు ఒకే పంటను సాగుచేసి నష్టపోద్దని డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేసి చీడలు రాకుండా ఇందులో పంట దిగుబడి లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సూచనలను పాటించాలని కోరారు. అదేవిధంగా ప్రతి రైతు ఈక్రాప్ తప్పనిసరిగా చేసుకోవాలని పంట నష్టపోతే భీమా పరిహారం పొందే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని చేపట్టి పంచ సూత్రాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకొని బంగారు పంటలు పండించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వం రాయితీతో అందించే డ్రిప్పు స్ప్రింకర్లు తో బిందు సేద్యాన్ని అలవాటు చేసుకుని సేంద్రీయ పద్ధతుల్లో కాలానికి తగిన డిమాండు ఉన్న పంటలు సాగు చేసుకోవాలని కోరారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తూ సుపరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సత్యసాయి జిల్లాలో పీఎం ధన ధ్యాన కృషి యోజన పథకాన్ని తీసుకొచ్చి ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో పంట సాగు రైతులకు మేలైన దిగుబడులు సాధించే విధంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నూతన సాంకేతిక విధానాన్ని అలవాటు చేసుకోవాలని అధిక పంట దిగుబడి సాధించేలా రైతులు ముందుకు రావాలని కోరారు.2029 నాటికి రాష్ట్రంలో 15% జిడిపి అభివృద్ధి సాధించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంగా పెట్టుకున్నారని అందుకు తగిన విధంగా నీటి యాజమాన్య పద్ధతులు నీటి కుంటలు చెరువులు రిపేరి ,చెక్ డాములు నిర్మాణ చేపట్టుకోవాలని సూచించారు. సత్య సాయి జిల్లాలో రైతులు చిక్కుడు మల్బరీ బొప్పాయి పూల సాగు కాయగూరల పెంపకం ఎక్కువగా చేపట్టాలని కోరారు. అంతేకాకుండా పంటల్లో అంతర్ పంటలు కూరగాయల సాగు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అధిక ఆదా యాన్ని పొందవచ్చని తెలిపారు. రైతుల సమస్యల పై అద్భుతంగా మాట్లాడిన దొన్నికోట కు చెందిన రైతు కేశవరెడ్డి , మహిళ రైతు వనజ ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రత్యేకంగా అభినందించి వారిని శాలువాతో ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ రాష్ట్ర డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్, కొత్తచెరువు మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్, సర్పంచ్ భారతి , సింగిల్ విండో అధ్యక్షులు రమణారెడ్డి ,మండల టిడిపి కన్వీనర్ శివశంకర్, జోనల్ 5 టిడిపి ఇన్చార్జ్ ఎల్ఐసి నర్సింహులు , బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ కుమార్ రెడ్డి ,జిల్లా వ్యవసాయ అధికారి రాము నాయక్ పశుసంవర్ధక అధికారి సుబదాస్ , ఉద్యానవనధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపి అధికారి సుదర్శన్ సిరికల్చర్, తహసిల్దార్ మనోజ్ కుమార్ ఎంపీడీవో శ్రీనివాసులు, ఇతర శాఖల అధికారులు ,కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.