Logo
Date of Publish : 14 March 2026, 5:23 pm
Editor : Shankaragallu Venkatesulu

ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క కుమారుడు–కోడలిని ఆశీర్వదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క కుమారుడు–కోడలిని ఆశీర్వదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

హైదరాబాద్ మార్చి 14 అనంత జనశక్తి న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్ కు వచ్చి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షి దంపతులను ఆశీర్వదించారు.ప్రజాభవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క–నందిని దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు.గత మార్చి 5న సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక జరిగింది. ఆ సమయంలో భట్టి విక్రమార్క స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చంద్రబాబును వివాహానికి ఆహ్వానించారు. అయితే అప్పట్లో ఉన్న అత్యవసర కార్యక్రమాలు, తీరికలేని కార్యక్రమాల కారణంగా చంద్రబాబు వివాహానికి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రత్యేకంగా ప్రజాభవన్‌కు వచ్చి నూతన దంపతులకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దులు శ్రీధర్ బాబు వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)