Logo
Date of Publish : 02 December 2025, 9:04 pm
Editor : Shankaragallu Venkatesulu

బైపాస్ రోడ్డు పనులను వేగంగా చేపట్టాలి

బైపాస్ రోడ్డు పనులను వేగంగా చేపట్టాలి

రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్

ఉరవకొండ , డిసెంబర్ 02 :అనంత జనశక్తి న్యూస్

ఉరవకొండ పట్టణ పరిధిలోని కనేకల్లు క్రాస్ నుంచి గుంతకల్లు రోడ్డు వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉరవకొండ పట్టణ పరిధిలో కనేకల్లు క్రాస్ నుంచి గుంతకల్లు రోడ్డు వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను వేగంగా త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కనేకల్లు క్రాస్ నుంచి గుంతకల్లు రోడ్డు వరకు 3 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు పనులను చేపడుతుండగా, ఇప్పటికే సగానికిపైగా పూర్తి కావడం జరిగిందని అధికారులు వివరించారు. ఇప్పటికే కనేకల్లు క్రాస్ నుంచి 900 మీటర్ల మెటల్ రోడ్డు పూర్తి కాగా, మరో 400 మీటర్ల మేర రోడ్డు ముందుకు వెళ్లేందుకు సర్వే చేపట్టాల్సి ఉందని తెలుపగా, సర్వే వెంటనే 1, 2 రోజుల్లో పూర్తి చేయాలని, రోడ్డు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్.అండ్.బి ఏఈ నాగభూషణం, సూపర్ వైజర్ సుంకన్న, తదితరులు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)