Logo
Date of Publish : 21 November 2025, 1:37 am
Editor : Shankaragallu Venkatesulu

అంగరంగ వైభవంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలు

అంగరంగ వైభవంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల

జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్

పుట్టపర్తి, నవంబర్ 20 , అనంత జనశక్తి న్యూస్

భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతజయంతి వేడుకలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు పుట్టపర్తిలో అద్భుతంగా జరుగుతున్నాయని.. అంగరంగ వైభవంగా విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు శ్రీసత్య సాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో... ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుట్టపర్తిలో ఈ శతజయంతి వేడుకలు చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు, భక్తులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా అన్ని విభాగాల సమన్వయంతో ఉత్సవాలను అద్వితీయంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. భగవాన్ శతజయంతి ప్రధాన కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానాశ్రయ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర బొగ్గు ,గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి గడ్కరీ, రాష్ట్ర విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర రెవిన్యూ శాఖ మాత్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, రాష్ట్ర బీసీ చేనేత శాఖామంత్రి సవితమ్మ, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్, ప్రముఖ సినీ నటి ఐశ్వరరాయ్ బచ్చన్, అనగాని సత్య ప్రసాద్, ఎన్ హెచ్ ఆర్ సి అధ్యక్షులు రామ సుబ్రహ్మణ్యన్, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ .వి .రమణ, గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రిలు రాష్ట్ర మంత్రులు కూడా శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగిందన్నారు. ఇప్పటివరకు పుట్టపర్తి పుణ్య క్షేత్రానికి 424153 మంది భక్తులు విచ్చేశారని, ఇందులో చాలా మంది సాయి100 యాప్ ద్వారా తమ సందర్శన వివరాలను నమోదు చేసుకున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భక్తుల సౌకర్యార్థం పలు రైల్వే స్టేషన్ల నుండి పుట్టపర్తికి 261 ప్రత్యేక బస్సులను ఉచితంగా నడపగా, ఇప్పటి వరకు 14272 మంది యాత్రికులు వివిధ ప్రాంతాల నుండి రవాణాసేవలు వినియోగించుకున్నారని తెలిపారు. అదనంగా 4606 మంది యాత్రికులు ఉచిత షటిల్ బస్సు సర్వీసుల ద్వారా పుట్టపర్తికి చేరుకున్నారని వివరించారు. ప్రముఖుల పర్యటనల సందర్భంగా 230 మంది వివిఐపి లకు వాహనాలు ఏర్పాటు చేసి వాళ్ళను సందర్శించడానికి అన్ని రకాల సందర్శన చర్యలు పూర్తి చేశామన్నారు. అలాగే మినీ బస్సుల ద్వారా ప్రముఖులు తదితరులు బాబా వేడుకల్లో పాల్గొనడం జరిగిందన్నారు. యాత్రికుల సౌకర్యార్థం తాత్కాలిక బస ఏర్పాట్ల భాగంగా వెస్ట్ గేటు, ఎనుములపల్లి, ప్రశాంతి నిలయం లో 1,92,151 మందికి బస ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో 25 దాకా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారా వైద్య సేవలు అందించడం జరిగిందని, ఇప్పటివరకు 8011 మంది ఉచిత ఆరోగ్య శిబిరాల వల్ల వివిధ సేవలను వినియోగించుకోవడం జరిగిందన్నారు. వాహనాల పార్కింగ్ కోసం కర్ణాటక నాగేపల్లి, శిల్పారామం, సాయి నగర్ క్రికెట్ గ్రౌండ్, అమూల్య లేఅవుట్, పరేడ్ గ్రౌండ్, ఆనంద్ విలేజ్, సందీప్ బేల్యూ, చెరుకూరి గ్రౌండ్, బుక్కపట్నం రోడ్డు, కమ్మవారిపల్లి తదితర పది ప్రదేశాలు ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు 95 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ద్వారా వివిధ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను చేపట్టడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు. తాగునీటి సరఫరా కు సంబంధించి నీటి ట్యాంకర్ల ద్వారా 42 కేంద్రాలలో నీటి సరఫరా , పురుషులకు 150 టాయిలెట్లు అలాగే మహిళలకు 150 దాకా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 356683 మంది భక్తులకు ఉచితంగా అన్నదానం అందించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో 5500 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో సేవలందించే విధంగా 18 దాకా గుర్తించిన ప్రదేశాలలో అగ్నిమాపక సేవల నిమిత్తం వాహనాలను ఏర్పాటు చేసి సిబ్బంది ద్వారా సేవలను అందించడంజరుగుతుందన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం 25 సపోర్ట్ 108 అంబులెన్స్ వాహనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.అదనంగా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్సీలు) వంటి 13 ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అక్కడ అవసరమైన ఔషధాలు మరియు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.ఇప్పటివరకు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వివిధ సమస్యలపై స్పందించి సమస్యల పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకొని 40 దాకా సమస్యలను పరిష్కరించడం తో పాటు సాయి 100 యాప్ ద్వారా 23 ఫిర్యాదులను స్వీకరించి వాటిపై తక్షణ పరిష్కార చర్యలు తీసుకొని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే శిల్పారామం వద్ద సెర్ఫ్ ద్వారా హస్తకళల శిబిరాలు , ప్రతిరోజు సాయంత్రం సమయంలో శిల్పారామం వద్ద వివిధ సాంస్కృత కార్యక్రమాలు, చిత్రావతి నదీలో తెప్పోత్సవం మరియు చిత్రావతి తీరాన లేజర్ షో ద్వారా సందర్శకులు ఆకట్టుకునే విధంగా ప్రదర్శనలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)