Logo
Date of Publish : 01 March 2026, 5:37 pm
Editor : Shankaragallu Venkatesulu

గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు: మంత్రి కొండపల్లి శ్రీనివాస

విజయవాడ మార్చి 01 అనంత జనశక్తి న్యూస్

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అక్కడి పరిస్థితులను కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఏపీ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన వెల్లడించారు.గల్ఫ్ దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులందరూ తక్షణమే తమ వివరాలను సంబంధిత భారత రాయబార కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. విమాన సర్వీసులు త్వరలోనే పునరుద్ధరించబడే అవకాశముందని, అందరూ సంయమనం పాటిస్తూ అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.సోషల్ మీడియా వేదికలలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం ద్వారా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. అత్యవసర సహాయం కోసం ఏపీ ఎన్నార్టీ హెల్ప్‌లైన్ నంబర్ 85000 27678 ను సంప్రదించవచ్చని తెలిపారు.మరింత సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ apnrts.ap.gov.in ను సందర్శించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)