Logo
Date of Publish : 28 March 2026, 3:23 am
Editor : Shankaragallu Venkatesulu

అమరావతి రాజధానికి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

అమరావతి రాజధానికి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

అమరావతి మార్చి 28, అనంత జనశక్తి న్యూస్

ఈరోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం జరగనుంది. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.ఈ అంశంపై అసెంబ్లీలో సుమారు నాలుగు గంటలపాటు విస్తృతంగా చర్చ జరగనుంది. అనంతరం ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.తీర్మానం సమన్వయ బాధ్యతలను మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్లకు అప్పగించినట్లు సమాచారం.రాష్ట్ర రాజకీయాల్లో ఈ సమావేశం కీలక మలుపు తిప్పే అవకాశమున్న నేపథ్యంలో అందరి దృష్టి అసెంబ్లీపై నిలిచింది.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)