Logo
Date of Publish : 01 December 2025, 6:09 am
Editor : Shankaragallu Venkatesulu

దేశంలో రూ. 4వేలు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంద్రప్రదేశ్ చారిత్రాత్మక నిర్ణయం

దేశంలో రూ. 4వేలు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంద్రప్రదేశ్ చారిత్రాత్మక నిర్ణయం

ఎలాంటి ఆధారం లేని నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు గొప్పవరం

జిల్లాలో 2,60,036 మందికి రూ 113.72 కోట్లు పంపిణీ

వృద్ధులు తలెత్తుకొని జీవించేలా చేసిన కూటమి ప్రభుత్వం

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు,డిసెంబరు: 01 , అనంత జనశక్తి ప్రతినిధి

నూజివీడు మండలం మర్రిబందం గ్రామంలో ఉదయం 7గంటలకే అవ్వ తాతలు, దివ్యాంగులు, వితంతువులు, తదితర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లును ఇంటింటికి స్వయంగా వెళ్ళి నిరాధారణకు గురైన నిరుపేదల మంచి చెడు యోగక్షేమాలను, ఆరోగ్య వివరాలను, గ్రామ, కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకుని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లబ్ధిదారులకు నగదును స్వయంగా అందజేశారు. ముందుగా గ్రామ ప్రజలు, మహిళలు,మంత్రికి ఘనస్వాగతం పలికారు. ప్రజలు అడిగిన కొన్ని సమస్యలను వెనువెంటనే పరిష్కరించారు. కొందరు ఇల్లు కావాలని అడగగా వెంటనే ధరఖాస్తులు పెట్టుకోండి వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నూజివీడు మండలంలో పింఛన్లు మరియు ఇళ్ల స్థలాల అవసరం ఉన్న లబ్ధిదారులను గుర్తించి మంజూరుకు అధికార్లు చర్యలు చేపట్టాలని, మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఒకే రోజున ఒకే సారి పెద్ద ఎత్తున రూ.4వేలు పింఛన్లును సొమ్ముపెంచి ప్రతినెల ఇంటింటికి వెళ్ళి నిరుపేద కుటుంబాలను కలుసుకుని వారి యోగక్షేమాలు, కుటుంబ ఆరోగ్య ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకుని పింఛన్లు సొమ్ము అందజేస్తున్నామని అన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ 3 వేలు నుంచి *రూ. 4 వేలుకు,* దివ్యాంగులకు రూ 3 వేలు నుంచి *రూ 6 వేలుకు,* బెడ్ రెస్టులో ఉన్న వారికి *రూ 10 వేలు, రూ 15 వేలు* చొప్పున పెంచి అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని, పనిచేసే ప్రభుత్వానికి, పనిచెయ్యని ప్రభుత్వానికి తేడాను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఏ ఆదరణ లేక నిరాధారణకు గురైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందన్నారు. గత ప్రభుత్వం హంగుఆర్భాటాలు, రంగులు మీద పెట్టిన శ్రద్ధ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై పెట్టలేదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుపేదలు ఇంటికి స్వయంగా వెళ్ళి పింఛన్లు సొమ్మును అందిస్తున్నారని గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయలేదని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా కూటమి ప్రభుత్వాన్ని దీవించిన అన్ని వర్గాలు ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతోనే అభివృద్ధి, సంక్షేమ దిశగా రాష్ట్రానికి మంచి ప్రజాపాలన అందిస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వం కేవలం బటన్ నొక్కీ డబ్భులు పంచడమే గొప్ప పని అని ప్రసారం చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమం తో పాటు అభివృద్ధి రెండు కళ్ళుగా అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తుందన్నారు. రాష్ట్రంలో బహుళ జాతి సంస్థలను స్థాపించి యువతకు ఉద్యోగ కల్పన మరియు రాష్ట్ర అభివృద్ధికి బాట వేసిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బహుళ జాతి సంస్థలు సుమారు.లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి అనేక సంస్థలు స్థాపించాయని తద్వారా రూ. 6లక్షల ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. సుమారు.16 వేల ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయని తెలిపారు.ప్రతీ ఏడాది డి, ఎస్, కి. ప్రకటన చేసి తద్వారా వేల ఉపాధ్యాయ ఉద్యోగ నియామకం జరుగుతుందన్నారు.రానున్న 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో యంపిడివో వివిధ శాఖల అధికారులు, గ్రామ సచివాలయ, వివిధ శాఖల ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు,మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాసు, గ్రామ నాయకులు రాము, కూటమి నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)