Logo
Date of Publish : 05 March 2026, 3:04 am
Editor : Shankaragallu Venkatesulu

నేడు ఏపీలో పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల

నేడు ఏపీలో పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల

అమరావతి / హైదరాబాద్‌: అనంత జనశక్తి న్యూస్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు నేడు అధికారికంగా విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను సంబంధిత పాఠశాలల ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నేడు టెన్త్‌ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో ఈ నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్‌టికెట్‌ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని విద్యాశాఖ సూచించింది.రెండు రాష్ట్రాల్లోనూ విద్యార్థులు పరీక్షా నియమావళిని కచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)