Logo
Date of Publish : 13 November 2025, 11:20 am
Editor : Shankaragallu Venkatesulu

మూడు రోజుల క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి.

మూడు రోజుల క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి.

వినుకొండ,నవంబర్13. అనంత జనశక్తి న్యూస్

పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ లోని జాషువా కళాప్రాంగణం నందు మూడు రోజుల మోడల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి.ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లాలోని పది మండలాల ఏపిఎం లు,ఒక సిసి,అకౌంటెంట్ లు,ఐదు మండలాల మండల సమాఖ్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించటం జరిగింది. ముఖ్యంగా ఈ శిక్షణలో సంవత్సరంనకు సంబంధించిన యాన్యువల్ యాక్షన్ ప్లాన్ లు తయారు చేయటం,దీనిలో ఆరోగ్యం - హాస్పిటల్లో కాన్పులు, విద్య,సామాజిక భద్రత అంశాలు,ఆస్తుల సృష్టి,సుస్థిర జీవనోపాధి కార్యక్రమాలు,శక్తి సామర్థ్యాలు పెంపు,ప్రవర్తనలో మార్పు ఇతర అంశాలపై మరియు ప్రభుత్వ పథకాల అమలు గురించి,కుటీర పరిశ్రమల ఏర్పాటు గురించి, ప్రజలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో ఏపిడి రాజా ప్రతాప్,జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కోయ రజినీ కుమారి,వినుకొండ మండల సమాఖ్య అధ్యక్షురాలు పద్మ,సెక్రటరీ కమల,ఏపిఎం రామాంజనేయులు, పది మండలాల ఏ పి ఎం లు,సి సి లు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)