ప్రియురాలిని ముక్కలు చేసి
ఫ్రిజ్‌లో పెట్టిన కిరాతకుడు
విశాఖలో ఒళ్లు గగుర్పొడిచే ఘోరం!
విశాఖపట్నం అనంత జనశక్తి న్యూస్
మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది. నమ్మిన పాపానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. విశాఖలోని ఎల్వీ నగర్ పరిధిలో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరై, అదే ప్రేమను ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఒక కిరాతకుడి ఉదంతం కన్నీళ్లు తెప్పిస్తోంది.
అసలేం జరిగింది?
నేవీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రవీంద్ర (35) అనే వ్యక్తికి, మౌనిక (29) అనే యువతికి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే, రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, మౌనికను తన ప్లాట్‌కు పిలిపించాడు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరగడంతో, ఆవేశం కట్టలు తెంచుకున్న రవీంద్ర.. మౌనికను అతి దారుణంగా హత్య చేశాడు.
గుండె కరిగే విషాదం..
అక్కడితో ఆ రాక్షసుడి పైశాచికత్వం ఆగలేదు. మృతదేహం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి, ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఒకప్పుడు ప్రేమగా చూసుకున్న చేతులే, ఆ శరీరాన్ని ముక్కలు చేయడానికి ఎలా ఒడిగట్టాయో తలుచుకుంటేనే హృదయం ద్రవిస్తోంది.