పిఠాపురంలో రేపు పవన్ కల్యాణ్ పర్యటన
పిఠాపురం, జూలై 18:అనంత జనశక్తి న్యూస్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు స్థానిక అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం.భుజానికి శస్త్రచికిత్స జరిగిన అనంతరం తొలిసారిగా పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనుండటంతో జనసేన శ్రేణులు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, పార్టీ కార్యకలాపాలపై ఆయన అధికారులతో చర్చించి పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.