Logo
Date of Publish : 20 September 2025, 9:07 am
Editor : Shankaragallu Venkatesulu

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం -కమీషనర్ నందన్ 

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం -కమీషనర్ నందన్

 

నెల్లూరు సెప్టెంబర్ 20,అనంత జనశక్తి న్యూస్

స్వచ్చాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్నినెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 28 డివిజన్లలో టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు .గ్రీన్ ఆంధ్ర సాధనలో భాగంగా ప్రతీ డివిజన్ లో మొక్కలు నాటారు .ప్రతీనెల మూడో శనివారం ప్రభుత్వం నిర్వహించే స్వచ్చాంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక పట్టణాభివృద్ధిశాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచనల మేరకు అన్ని డివిజన్లలో గ్రీన్ ఆంధ్రను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు .14వ డివిజన్ ఏ.సీ నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పాల్గొన్నారు స్థానిక ప్రజలందరితో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం కమిషనర్ నందన్ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో మొక్కలను నాటి సంరక్షించాలని, మొక్కల పెంపకాన్ని ఆదర్శంగా చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు, గణేశం వెంకటేశ్వర్లు,సిటీ టీడీపీ మహిళా నాయకురాలు కప్పిర రేవతి ,టీడీపీ నేతలు నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)