కుట్రలు, కుతంత్రాలకు తావులేదు: సీఎం చంద్రబాబు
అమరావతి జూలై 18, అనంత జనశక్తి న్యూస్
రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలు ఇంకా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. డబ్బులు ఖర్చు చేసి సోషల్ మీడియా ద్వారా విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు.రాష్ట్రంలో "గొడ్డలి పార్టీ"నే ప్రధాన సమస్యగా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు ఘటనపై ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఉందని, నిందితుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు. అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం, రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు సంపూర్ణ రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.