ఆంధ్రప్రదేశ్లో నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదనే ఓ రకమైన సైకోల సంఖ్య గత నాలుగేళ్ల కాలంలో పెరిగిపోయింది. ఎంత మంది సైకోలు అలాంటి మనస్థత్వంతో అమ్మాయిలను చంపేశారు. దాడులు చేశారు. వీరి గురించి వార్తలు వచ్చినప్పుడల్లా ప్రేమోన్మాది.. సైకో అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే మనస్థత్వాన్ని అమరావతి విషయంలో చూపిస్తోంది. రాష్ట్ర రాజధానికి భూములివ్వడమే రైతులు చేసిన తప్పన్నట్లుగా వారి అంతం చూస్తామన్నట్లుగా ప్రవర్తిస్తోంది. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఏమీ పట్టించుకోవడం లేదు. రైతులకు కౌలు కూడా ఇవ్వరు కానీ భూములు సెంట్ స్థలాలుగా పంపిణీ అమరావతి భూములు ప్రభుత్వానివి అవ్వాలంటే.. ముందు సీఆర్డీఏ చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కనీసం కానీ ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వకుండా వారి భూముల్ని .. మాస్టర్ ప్లాన్ ను కూడా మార్చేసి.. పేదల పేరుతో ఇతరులకు పంచి పెట్టడానికి ప్రణాళికలు వేయడం .. అమరావతిని చంపేయడమే. అందులో సందేహం లేదు. కానీ ప్రభుత్వం అలా చంపడానికే ప్రాధాన్యం ఇస్తోంది. సొంత రాజధానిని చంపుకునే ప్రభుత్వం ప్రపంచంలోనే మొదటిది! ఎవరైనా ఓ దేశాధినేత.. రాష్ట్రాధినేత.. తన రాష్ట్రానికి మేలు చేయాలనుకుంటారు. కానీ ఏపీ సీఎం మాత్రం రాష్ట్ర విధ్వంసమే తన హక్కు అనుకుంటూ ఉంటారు. ప్రశ్నించిన వారిపై కేసుల కత్తి పెడతారు. ఇప్పటికే పరిశ్రమలన్నింటిని తరిమేశారు. సొంత ప్రాంతం కోసం విదేశాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఏపీలోపెట్టుబడులు పెట్టకుండా చేశారు. ఉన్న పరిశ్రమల్ని తరిమేస్తున్నారు. పోలవరం వంటి ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు . ప్రజలు ఆర్థిక స్థితిగతుల్ని నాశనం చేసేశారు. ఇప్పుు కలల రాజధాని అమరావతి మీద పడ్డారు. ఇలా తమ రాజధానిని చంపుకునే మొదటి ప్రభుత్వం ఏపీదే అవుతోంది. రైతుల చట్టబద్ద హక్కులు కాపాడలేని వ్యవస్థలతో ఇక ఎవరికి రక్షణ ? రైతులు పక్కా చట్టాలతో… భూములు ఇచ్చే ముందు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూంటే అదీ కూడా కోర్టు తీర్పును కూడా ఉల్లంఘించి.. ఇక వారిని కాపాడలేని.. వారి హక్కులకు రక్షణ కల్పించలేని వ్యవస్థలు .. దేశంలో ఎవరికి భరోసా ఇస్తాయన్నది ఇక్కడ కీలకమైన అంశం. ఇది ప్రభుత్వాలపై నమ్మకానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు.. ఏదైనా ప్రభుత్వ వ్యవస్థను నమ్మాలంటే ఎవరైనా ఆలోచించడానికి సంకోచించే పరిస్థితి. అమరావతి రైతులకు ఒప్పందం ప్రకారం న్యాయం జరగకపోతే.. ఈ దేశంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది.