Logo
Date of Publish : 02 December 2025, 9:00 pm
Editor : Shankaragallu Venkatesulu

కూటమి ప్రభుత్వానికి నేతలు,కార్యకర్తలు కీలకం -మంత్రి నారాయణ 

కూటమి ప్రభుత్వానికి నేతలు,కార్యకర్తలు కీలకం -మంత్రి నారాయణ

డివిజన్లలో పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలకు దిశా నిర్దేశం చేసిన మంత్రి.

పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తు ఉంటుందని వెల్లడి.

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన.

నెల్లూరు డిసెంబర్ 02, అనంత జనశక్తి న్యూస్

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు .నెల్లూరు నగరంలోని 28 డివిజన్లకు సంబంధించి నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలతో మెడికల్ కాలేజ్ లోని కాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి నారాయణ సమావేశం అయ్యారు.పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని వారిచేత సామూహిక ప్రమాణం చేయించారు.డివిజన్లలో పార్టీ బలోపేతంపై వారికి దిశా నిర్దేశం చేశారు .పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.2024 ఎన్నికల్లో 72 వేల 489 ఓట్ల మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు .2014 చేసిన అభివృద్ధికి ప్రతిఫలాన్ని ఇచ్చారని ,అభివృద్ధిని కాంక్షించే అత్యధిక మెజారిటీని ప్రజలు ఇచ్చారన్నారు..సుమారు 3600 మంది కార్యకర్తలు ఎన్నికల్లో కష్టపడ్డారని.. ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటామని మంత్రి భరోసా కల్పించారు.. ఎన్నికల్లో చెప్పినదానికంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు .కార్యకర్తల సంక్షేమానికి ఏడాదికి 10 కోట్ల రూపాయలు నా సొంత నిధులు ప్రకటించానని మరోసారి గుర్తు చేశారు.. మాట ప్రకారం ఆర్థిక సాయం కోరిన కార్యకర్తలకు 25వేల రూపాయలు వంతున ఇస్తున్నానన్నారు.. ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు .సీఎం చంద్రబాబు నాయుడు , యువ నేత లోకేష్ ఆదేశానుసారం పార్టీ బలోపేతానికి ముందుకు సాగుతున్నామన్నారు.ఈ కార్యక్రంలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్,తహసీన్ ,రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు,బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ,టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు,మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పిటిసీ విజేతా రెడ్డీ ,కార్పొరేటర్లు ,టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు .


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)