పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కలిసిన కరస్పాండెంట్లు
తలుపుల మే 07,అనంత జనశక్తి న్యూస్
తలుపుల శ్రీ సాయి విద్యాసంస్థ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి, మరియు కడప జిల్లా గురజాలా చంద్రమోహన్ రెడ్డి,తిరుపతి జిల్లా సత్యవేడు నారాయణస్వామి, నెల్లూరు జిల్లా గూడూరు సురేంద్రబాబు,ఈరోజు గౌరవనీయులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి తమీమ్ అన్సారి ఐఏఎస్ ని కలిసి, ఓపెనింగ్ పర్మిషన్ మరియు రికగ్నేషన్ విషయాల పైన చర్చించడం జరిగింది. విద్యాశాఖ కమిషనర్ సానుకూలంగా విని తొందరలోనే ఈ విషయాలపై మీ యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తాను. అన్ని విషయాలు చర్చించినాక ప్రభుత్వానికి పంపిస్తాను. సానుకూల నిర్ణయమే వస్తుంది. మీ బడ్జెట్ స్కూల్స్ వాళ్ళు అధైర్య పడకండి అని ఆమె తెలియజేశారు. మరీ ముఖ్యంగా తెలియజేయడమేమనగా మేడమ్ ని మన ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు సంబంధించి మొట్టమొదటిగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ చర్చించిన వీరందరికీ మన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్య గమనిక నేను ఉన్నాను అని మన యూనియన్ స్థాపించినప్పటి నుంచి అన్ని విషయాలపైన సహకరిస్తూ మనోధైర్యం చెబుతూ ముందుకెళ్తున్న గౌరవనీయులు కదిరి వాల్మీకి స్కూల్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పలవల పవన్ కుమార్ రెడ్డి కి మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా CRO కోటిరెడ్డి రవిచంద్ర రెడ్డి కి మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా బడ్జెట్ స్కూల్ పై మీ సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం.