- రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- కార్యక్రమంలో పాల్గొని శ్రీ విఘ్నేశ్వర స్వామికి పూజలు చేసిన జిల్లా కలెక్టర్
- జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
- జిల్లా అభివృద్ధిలో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడాలి
- -జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
- అనంతపురం, సెప్టెంబర్ 07 :అనంత జనశక్తి న్యూస్
- నగరంలోని టవర్ క్లాక్ వద్దనున్న కృష్ణ కళామందిర్ లో శనివారం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పాల్గొని శ్రీ విఘ్నేశ్వర స్వామికి తొలి పూజలు నిర్వహించారు.సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు విద్య, బుద్ధి, ఆయురారోగ్యాలు భగవంతుడు కలిగించాలని కోరుకున్నారు. జిల్లా అభివృద్ధిలో ఎటువంటి అడ్డంకులు రాకుండా జిల్లా అభివృద్ధి పథంలో నడవాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ జి.మారుతి, తహసీల్దార్ లు రియాజుద్దీన్, వసంతలత, బ్రహ్మయ్య, రజాక్ వలి, మోహన్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ మరియు జేఏసీ చైర్మన్ దివాకర్ బాబు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ నారాయణస్వామి, స్టేట్ సెక్రటరీ సోమశేఖర్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మంజునాథ్, కలెక్టరేట్ ట్రెజరర్ వరకుమార్, కలెక్టరేట్ సిబ్బంది భరత్, సీన, తదితరులు పాల్గొన్నారు.