ఉత్కంఠ భరితంగా రాప్తాడు-ధర్మవరం సూపర్ లీగ్ మెగా క్రికెట్ టోర్నమెంట్
పరిటాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాప్తాడు ధర్మవరం సూపర్ లీగ్ మెగా టోర్నమెంట్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. మూడవరోజు కూడా పలు గ్రామాల జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. మూడవరోజు పోటీల్లో భాగంగా రాప్తాడు మండలంలోని మరూరులో క్రికెట్ పోటీలను పరిటాల సునీత ప్రారంభించారు. యర్రగుంట – పాలబావి జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. సునీత ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ ఎగరవేసి పోటీలను ప్రారంభించారు. కాసేపు బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడరు. మరోవైపు ధర్మవరంలో మూడవరోజు పోటీలను పరిటాల శ్రీరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత, శ్రీరామ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని చాటే విధంగా క్రికెట్ ఆడాలని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. క్రికెట్ ఆడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నీరు తరచూ తీసుకోవాలని.. గ్రౌండ్ లో తాగునీరు భోజన వసతి కూడా ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు.
*3వ రోజు జరిగిన మ్యాచ్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే….*
ధర్మవరం నియోజకవర్గంలో 15 మ్యాచ్ లు జరుగగా…
స్కై ఆఫ్ ద బాల్ టీం పై బిగ్ బాస్ టీం, ఉప్పునేసిన పల్లి టీం పై గొట్లూరు వన్ టీం, గొట్లూరు టూ టీం పై మల్లేనిపల్లి టీం, రెబల్ స్టార్ టీం పై అర్జున్ టైటాన్ టీం, క్రేజీ శివ టీం పై హనుమాన్ లెవెన్ టీం, బత్తలపల్లి 1980 టీం పై రాఘవంపల్లి టీం, చెన్నరాయపట్నం టీం పై బత్తలపల్లి హంటర్ టీం, ఎర్రాయిపల్లి టీం పై లింగారెడ్డి పల్లి టీం, సంజీవపురం టీం పై వెంకటగారిపల్లి టీం, చిల్లవారిపల్లి టీం పై శివంపల్లి టీం, పెద్దకోట్ల టీం పై పిన్నదరి టీం, గుడ్డంపల్లి టీం పై తాడిమర్రి టీం, వలిమి చెర్లోపల్లి టీం పై నాగారెడ్డిపల్లి టీం, మలక వేముల టీం పై సానివారిపల్లి టీం, మంగళమడక టీం పై తప్పెటవారి పల్లి టీమ్ లు విజయం సాధించగా…
రాప్తాడు నియోజకవర్గంలో 22 మ్యాచ్ లు జరగగా…
ఆత్మకూరు అంబేద్కర్ లెవెన్స్ టీం పై, ఆత్మకూరు ఎస్ కే డి మదన్ టీం, బి యాలేరు టీంపై ఆత్మకూరు రాము లెవెన్స్ టీం, తలుపూరు లెవెన్స్ టీంపై మదిగుబ్బ శివ టీం, ఆత్మకూరు సాయి లెవెల్స్ టీం పై పీ.యాలేరు గల్లీ టీం, నందమూరి లెవెల్స్ టీం పై ఇటుకలపల్లి టీం, కందుకూరు టీం పై ఆకుతోట పల్లి టీం, తాటిచెర్ల టీం పై ఉప్పరపల్లి టీం, పాపంపేట బంకర్స్ టీం పై ఎన్ ఆర్ కాలనీ టీం, పాలబావి జూనియర్స్ టీం పై ఎర్రగుంట టీం, బండమీదపల్లి టీం పై గొందిరెడ్డిపల్లి టీం, చిన్మయనగర్ టీం పై జి కొత్తపల్లి టీం, గొల్లపల్లి టీం పై బండమీదపల్లి టూ టీం, తూముచెర్ల జూనియర్స్ టీం పై ముతవకుంట్ల ఎస్సీ కాలనీ టీం, తగరకుంట టీం పై తూముచర్ల టూ టీం, రాంపురం టీం పై మామిళ్ళపల్లి టీం, తల్లిమడుగుల రామంజి టీం పై ముత్తువకుంట్ల అంజి టీం, కేజీ కుంట టీం పై గంతిమర్రి టీం, పోలేపల్లి టీం పై పేరూరు జూనియర్స్ టీం, గరిమేకలపల్లి టీం పై ఆర్ కొత్తపల్లి టీం, రామగిరి గంగపుత్ర టీం పై మాదాపురం టీం, నాగసముద్రం రాయల్స్ టీం పై చెన్నేకొత్తపల్లి దుర్గా టీమ్ ఎన్ ఎస్ గేట్ భార్గవ టీం పై చెన్నై కొత్తపల్లి లక్ష్మీనరసింహ టీం లు విజయం సాధించాయి…