రెండవ రోజు మంత్రి పయ్యావుల కేశవ్ "ప్రజాదర్బార్"
నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
ఉరవకొండ, డిసెంబర్ 02 :అనంత జనశక్తి న్యూస్
ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయంలో వరుసగా రెండవరోజు రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ "ప్రజాదర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం ఉరవకొండ నియోజకవర్గం, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై మంత్రి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి "ప్రజాదర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రజాదర్బార్ లో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు. తమ కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు లాంటివన్నారు. ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధికి తాను మొదటి కూలీగా పని చేస్తానన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు నలుమూలల నుంచి వచ్చిన బాధితులు, నాయకులు, ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించడం జరిగిందని, ఎలాంటి ఆలస్యం కాకుండా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.