Logo
Date of Publish : 06 July 2026, 9:01 am
Editor : Shankaragallu Venkatesulu

వేకువజామున చోరీ కలకలం

వేకువజామున చోరీ కలకలం

20 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరణ

యల్లనూరు, జూలై 6:అనంత జనశక్తి న్యూస్

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లి గ్రామంలో సోమవారం వేకువజామున భారీ చోరీ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమణ–లక్ష్మీదేవి దంపతుల ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు బీరువాలను ధ్వంసం చేసి అందులో భద్రపరిచిన సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.1 లక్ష నగదును అపహరించారు.ఉదయం ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పెద్దమల్లేపల్లి గ్రామంలో కలకలం రేగింది.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)