Logo
Date of Publish : 07 July 2026, 12:39 am
Editor : Shankaragallu Venkatesulu

పెద్దమల్లేపల్లిలో భారీ చోరీ….

పెద్దమల్లేపల్లిలో భారీ చోరీ....

— క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరణ

యల్లనూరు, జులై 6, అనంత జనశక్తి న్యూస్ ;

యల్లనూరు మండలంలోని పెద్దమల్లేపల్లి గ్రామంలో సోమవారం వేకువజామున రమణ లక్ష్మీదేవి దంపతుల ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఇంటి తలుపులు బద్దలగొట్టి ఇంటిలోని బీరువాలను ధ్వంసం చేసి అందులో ఉన్న 18తులాల బంగారు, 30తులాల వెండి, రూ.లక్ష నగదు దొంగలు ఎత్తుకెళ్లారు విషయం తెలుసుకున్న సీఐ సత్యబాబు, ఎస్ఐ రామాంజనేయరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన సంఘటన పై ఆరా తీసారు. జాగిలాలను తెప్పించి పరిసర ప్రాంతాలలో దొంగలను గుర్తించే ప్రయత్నం చేశారు. అనంతరం నిందితులను గుర్తించేందుకు వేలిముద్రల ఆధారాలను సేకరించారు.

 

మరో రెండు చోట్ల దొంగతనానికి యత్నం...

పెద్దమల్లేపల్లిలోని రమణ- లక్ష్మీదేవి దంపతుల ఇంటిలో చోరీ అనంతరం పక్కనే ఉన్న మరో ఇంటిలో దొంగతనం చేసేందుకు అటుగా వెల్లిన దొంగలను గుర్తించిన ఇంటి యజమానులు కేకలు వేయడంతో పరారయ్యారు. అలాగే వెళుతూ వెళుతూ పక్క గ్రామమైన 85 నిట్టూరులో ప్రధాన రహదారిలో ఉన్న ఓ ఇంటిలో కూడా చోరీయత్నం చేసేందుకు దొంగలు ప్రయత్నించగా వారు సైతం కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. వీటి ఆధారంగా ఎంతమంది దొంగలు ఈ సంఘటనలో పాల్గొని ఉంటారు దొంగతనాలకు పాల్పడిన వారు పాత నేరస్తుల, కొత్త నేరస్తుల అన్న కొనాల్లో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)