పామిడి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు…
లంచం కేసులో సబ్‌రిజిస్ట్రార్‌పై విచారణ
అనంతపురం "అనంత జనశక్తి న్యూస్"
అనంతపురం జిల్లా పామిడి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంటి రిజిస్ట్రేషన్ పనికి సంబంధించి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ప్రైవేట్ వ్యక్తి వెంకటేశులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.ఈ లంచం సబ్‌రిజిస్ట్రార్ రాధరమణ సూచనలతోనే తీసుకున్నట్లు వెంకటేశులు విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్ రాధరమణపై కూడా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.ఈ కేసులో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐ హమీద్ ఖాన్ ఆధ్వర్యంలో కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా అనంతపురంలోని సబ్‌రిజిస్ట్రార్ రాధరమణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంటికి తాళం వేసి సోదాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.