ఎన్టీఆర్ తోనే బడుగులకు రాజ్యాధికారం
తెలుగు జాతీ గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్
ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ విగ్రవిష్కరణ
మండల, పంచాయతీ కేంద్రాల్లో ఎన్డీఆర్ విగ్రహాల ఏర్పాటు చేస్తా మంత్రి సవిత
సోమందేపల్లి (పెనుకొండ ) నవంబర్ 16 అనంత జనశక్తి న్యూస్
ఎన్టీఆర్ తోనే బడుగుల కు రాజ్యాధికారం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవితమ్మ తెలిపారు. సోమందేపల్లి మండల కేంద్రంలో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు. అంతకుముందు సోమందే పల్లె లోని కొత్తపల్లి క్రాస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్టీఆర్ తోనే బడుగులకు రాజ్యాధికారం ఏర్పడిందని ఎన్టీఆర్ పేరే ఒక ప్రపంచమని ఈ పేరే ఒక చరిత్ర అన్నారు . తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ చిరస్థాయిలో ఉంటారని తెలుగోడి ఆత్మగౌరవాన్ని నినాదంతో ఢిల్లీ గడ్డను ఆనాటి ఢిల్లీ పెద్దలను గడగడలాడించారు .
నియోజక వర్గంలో ప్రతి మండల, పంచాయతీ కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు నెలకొల్పనున్నట్లు తెలిపారు.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కలుగలేదన్నారు. అటువంటి సమయంలో అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశ పార్టీని స్థాపించి, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారన్నారు. సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఎన్టీఆర్ అవకాశమిచ్చారన్నారు. పూల వ్యాపారం చేసుకునే తన తండ్రి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిని చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. బడుగుల బాంధవుడైన అన్నఎన్టీఆర్ విగ్రహానికి తన జన్మధన్యమైందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు కూడా బడుగు, బలహీన వర్గాలకు చెందిన తనలాంటి వారెందరికో రాజకీయ ప్రాధాన్యమిస్తున్నారన్నారు. బడుగుల సంక్షేమానికి ఎంతో కృషి చేసిన యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ అని, ఆయన విగ్రహాలను నియోజక వర్గ వ్యాప్తంగా మండల, పంచాయతీ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా బాలయ్య సినిమా రాజకీయ రంగంలో సింహంలా గర్జిస్తున్నారని, సమాజ సేవలోను బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారన్నారు బసవతారకం ట్రస్ట్ చైర్మన్ గా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు కు ఆపద్బాంధవుడుగా నిలిచారన్నారు. అటు సినిమా రంగంలో ఇటు సామాజిక రంగంలో బాలయ్య చేస్తున్న సేవలు గాను అవార్డు ఆయనకు దాసోహం అవుతున్నాయని అన్నారు. బాలయ్య చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడం ద్వారా నా జన్మ ధన్యమైందని అని మంత్రి సవిత తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎంపీ బీకే పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి , ధర్మవరం ఇంచార్జి పరిటాల శ్రీరామ్ , జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప , సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బాలయ్య బాబు అభిమానులు పాల్గొన్నారు...