Logo
Date of Publish : 02 December 2025, 8:52 pm
Editor : Shankaragallu Venkatesulu

పెండింగ్ లో ఉన్న కీలక సమస్యలకు నాంది పలికిన హరీష్

పెండింగ్ లో ఉన్న కీలక సమస్యలకు నాంది పలికిన హరీష

-ధర్మవరం సాయి నగర్‌లో ఏళ్ల తరబడి కొనసాగిన లో–వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం.

-సాయినగర్‌లో రోడ్డు–విద్యుత్ సమస్యలకు డబుల్ సొల్యూషన్.

-రెండు కీలక సమస్యలు పరిష్కారంతో హరీష్యుడికి ప్రజలు కృతజ్ఞతలు.

శ్రీ సత్య సాయి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 2, అనంత జనశక్తి న్యూస్:

ధర్మవరం నియోజకవర్గంలోని సాయినగర్ ప్రాంత ప్రజలను ఏళ్ల తరబడి వేధించిన లో–వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పశువుల ఆసుపత్రి పరిసరాల్లో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్య కారణంగా ఇంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోవడం వరకూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో పలువురు నాయకులను అడిగినా పరిష్కారం లభించకపోగా, 05 జనవరి 2022న అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి ‘గుడ్ మోర్నింగ్’ ప్రోగ్రామ్‌ పేరిట ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు. ఈ నేపథ్యం మధ్య ప్రజలు తమ సమస్యను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకురాగానే మంత్రి వెంటనే స్పందించి, సాయినగర్‌లో కొత్త డీపీ ఏర్పాటు చేయించడంతో పాటు పట్టణంలోని మరో నాలుగు చోట్ల ఉన్న లో–వోల్టేజ్ సమస్యలను మార్చించి శాశ్వత పరిష్కారం కల్పించారు. అంతేకాక, అదే వార్డులో గత ప్రభుత్వ కాలంలో సగం వరకు మాత్రమే వేసిన సీసీ రహదారితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి వెంటనే ఆ రోడ్డును పూర్తిచేయించేలా చర్యలు తీసుకోవడంతో ప్రజలకు ఎంతో ఉపశమనం లభించింది. ఈ అభివృద్ధి పనులను బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జి.ఎం. శేఖర్, మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు లు అధికారికంగా ప్రారంభించగా, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు కీలక సమస్యలు ఒకేసారి పరిష్కారమవడంతో స్థానిక ప్రజలు మంత్రి సత్య కుమార్ యాదవ్ కి మరియు హరీష్ బాబు కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)