Search
Close this search box.
Search
Close this search box.

మెదడు కారాదు కల్లోలం వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్

మెదడు కారాదు కల్లోలం వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్

జూన్ 8న

డాక్టర్. రామ్మోహన్ నాయక్

కన్సల్టెంట్ న్యూరోసర్జన్

కిమ్స్ సవీర, అనంతపురం. 

బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో ఏవైనా కణాలు అసాధారణ స్థాయిలో పెరగడం చేత కణితులు తయారవుతాయి. బ్రెయిన్ ట్యూమర్స్ క్యాన్సర్ కానివి మరియు క్యాన్సర్ ట్యూమర్స్ ఉంటాయి. మెదడు క్యాన్సర్ మెదడులోనే తయారై పెరవచ్చు లేదా శరీరంలోని వేరే భాగాల్లో తయారై మెదడుకు సోకవచ్చు వీటిని మోటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. ఈ ట్యామర్లు అనేవి అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి ఏ వయసుల వారికైనా రావచ్చు. 

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీన వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా అన్ని దేశాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను అవగాహన పరుస్తారు. మెదడులో కణితులు రావడం వల్ల వచ్చే ప్రమదాలు, రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం వల్ల రోగులతో పాటు సామాన్య ప్రజలకు అవగాహన పెరుగుతుంది. 

ముఖ్యంగా క్యాన్సర్ కణాలు కొన్ని భాగాల్లో తయరై మెదడుకు వెళ్లవచ్చు. అవి ఎముకలు, థైరాయిడ్ గ్రంధి, రొమ్ము క్యాన్సర్, పేగులు, చర్మం, ఊపిరితిత్తులు, కిడ్నీ ద్వారా రావచ్చు. 

మనిషి వయస్సు పెరిగే కొద్ది మెదడు క్యాన్సర్ యొక్క ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. మెదడులో పెరిగే ట్యూమర్ మెదడు కణాలు, మెదడు చుట్టూ ఉండే పొరలు, నరాలు మరియు పిట్యూటరి గ్రంధి నుంచి రావచ్చు. 

బ్రెయిన్ ట్యూమర్ పెరిగి కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. కావున వీటి వల్ల వచ్చే లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ట్యూమర్ రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇప్పటి వరకు పూర్తి అవగాహన లేదు కానీ కొన్ని వంశపారంపర్యంగాను, తరుచూ రేడియేషన్ కి ఎక్స్ పోజ్ కావటం, కొన్ని రకాల కెమికల్స్ కి గురికావడం వల్ల రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్లలలో గ్లయోమా, మెనింజియెమా, పిట్యూటరి గంధ్రి ట్యూమర్స్ మొదలైనని ఉంటాయి. 

సకాలంలో వ్యాధి గుర్తించడకపోవడం వల్ల అది చాలా ప్రమాదకరంగా మరే అవకాశం ఉంది. ధూమపానం అధికంగా చేయటం వల్ల ఛాతీ క్యాన్సర్ వచ్చి అది మెదడుకు రావచ్చు. 

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి లక్షణాలు

తలనొప్పి: తరుచూ తలనొప్పి వచ్చి దాని తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతూ ఉండటం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువగా అవ్వడం మరియు నిద్ర లేచేటప్పుడు వచ్చే తలనొప్పి కొంత ప్రమాదకరంగా మెదడులో కణితికి సంకేతాలు కావచ్చు .

వికారం మరియు వాంతులు: వాంతులు పగటి కంటే ఉదయం పూట ఉండే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 

మూర్ఛలు (ఫిట్స్) బ్రెయిన్ ట్యూమర్ కి మరో లక్షణం: ఫిట్స్ రావటం, మూర్ఛ వచ్చి స్పృహ కొల్పోవటం జరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్ వల్ల కాకుండా వేరే కారణాల వల్ల కూడా మూర్ఛ రావచ్చు. దీనికి సరైన పరీక్షలు చేసి నిర్ధారించుకోవడం మంచిది. 

తెలవితేటలు, వ్యక్తిత్వంలో మార్పు: అసంబద్దంగా నడవటం లేదా ఒకవైపు శరీరంలో బలహీన పడడం జరగవచ్చు. మాటల్లో మార్పు లేదా పూర్తిగా మాట రాకపోవడం, వాసన, రూచి తెలియకపోవడం, వినికిడి లేదా చూపు మందగించడటం, నడకలో మార్పు రావడం అనే లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా అవసరం. 

ఎలా నిర్థారణ చేస్తారు:

వైద్యులందరి దగ్గరికి వెళ్లిన తర్వాత కొన్ని పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. 

తలకు ఎక్స్ –రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ చేసి నిర్థారణ చేయడం జరుగుతుంది. 

చికిత్స:

వ్యాధి నిర్థారణ కొంత వరకు జరిగిన తర్వాత చికిత్స అనేది వివిధ కారణాల వల్ల మారవచ్చు. అది కణితి పరిణామం బట్టి, కణితి ఉన్నటువంటి ప్రదేశం మరియు రోగి యొక్క సాధారణ ఆరోగ్యం పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. 

సర్జరీ: 

సర్జరీ అనేది చాలా వరకు మెదడు కణితికి అవసరం. శస్త్రచికిత్స చేసి ఆ కణాలను బాయాప్సీ అనే పరీక్షకు పంపడం జరగుతుంది. 

బాయాప్సీ యొక్క ఫలితాలను బట్టి ఒక వేళ క్యాన్సర్ అని తేలిన తరువాత దానికి కీమోథెరపి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళా అది బయాప్సీ ప్రకారం క్యాన్సర్ కానీచో వేరే కీమోథెరపీ లేదా రేడియోథెరపీ అవసరం లేదు. క్యాన్సర్ కణాలు లేని ట్యూమర్ సర్జరీతో పాటు నయం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి