Logo
Date of Publish : 23 January 2026, 9:17 am
Editor : Shankaragallu Venkatesulu

రాష్ట్ర యువత ఆశాజ్యోతి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

రాష్ట్ర యువత ఆశాజ్యోతి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

సేవతో కూడిన రాజకీయానికి ప్రతీకగా కార్యక్రమాలు

అనంతపురం జనవరి 23, అనంత జనశక్తి న్యూస్

యువగళం అధినేతగా, యంగ్ డైనమిక్ లీడర్‌గా, రాష్ట్ర యువత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా కమలానగర్‌లోని మహిళా నిరాశ్రయుల ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత్/లింగ బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి తుల్జాపూర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా వృద్ధులతో కలిసి కేక్ కటింగ్ చేయడం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, వృద్ధ మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా తుల్జాపూర్ స్వప్న మాట్లాడుతూ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు ప్రతిరూపంగా, తండ్రికి తగ్గ కొడుకుగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ రాజకీయాల్లో కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారని పేర్కొన్నారు.ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఐటీ కంపెనీలను తీసుకువచ్చే దిశగా మంత్రివర్యులు నారా లోకేష్ చేపడుతున్న చర్యలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించనున్నాయని ఆమె అన్నారు. యువతకు ఆశ, మహిళలకు భరోసా, పేదలకు అండగా నిలుస్తున్న నాయకుడిగా నారా లోకేష్ నిలుస్తున్నారని కొనియాడారు.ఇంతటి విజన్ కలిగిన నాయకత్వం గల, క్రమశిక్షణతో కూడిన పార్టీ లో పనిచేసే అవకాశం లభించడం తన పూర్వజన్మ సుకృతమని, రానున్న రోజుల్లో మంత్రివర్యులు నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)