సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన శ్రీరామ్
-పీఎం ఆవాస్ యోజన గృహ నిర్మాణానికి డిసెంబర్ 14 వరకు గడువు.
-జియో ట్యాగింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి.
-సీఎంఆర్ఎఫ్ చెక్కులను 7 మందికి 4.77 లక్షల విలువైన చెక్కులు అందజేత.
-ధర్మవరం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్.
ధర్మవరం డిసెంబర్ 2, అనంత జనశక్తి న్యూస్:
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై 2.0) పథకం కింద జియో టాకింగ్ చేయని వారికి డిసెంబర్ 14 వరకు అవకాశం ఉందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ధర్మవరం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పీఎం ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసినవారికి, ఇంకా దరఖాస్తు చేయని అర్హులైన లబ్ధిదారులకు డిసెంబర్ 14 వరకు గడువు పొడిగించినట్లు శ్రీరామ్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధిలోని సచివాలయాల్లో గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. హౌసింగ్ ఇంజినీరింగ్ సిబ్బంది ద్వారా తమ స్థలాల్లో జియో ట్యాగింగ్ చేయించుకోవడం తప్పనిసరి అన్నది ప్రజలకు అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లకు జియో ట్యాగింగ్ అన్నది తప్పనిసరిగా అవసరమని జియో ట్యాగింగ్ చేయించుకోకపోతే లబ్ధిదారులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వీటిపై నాయకులు, కార్యకర్తలు నేటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అవగాహన కల్పించాలని తెలిపారు. దరఖాస్తుకు ఎలాంటి పత్రాలు అవసరం అలాగే జియో ట్యాగింగ్ కు ఏమి ఉండాలన్నది వారికి తెలియజేయాలన్నారు. సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకొని ప్రజలకు అవగాహన కల్పించి ఎవరు నష్టపోకుండా చూడాలని తెలిపారు. 14 వ తేదీ వరకు నాయకులు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఉండి ఈ పథకం పై దృష్టి సారించాలని ఆదేశించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ;;
ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ఎన్టీఆర్ వైద్య సేవలు అందక ప్రైవేట్ ఆస్పత్రిల్లో చికిత్సలు పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పరిటాల శ్రీరామ్ అందజేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన 7మందికి రూ. 4.77 లక్షల రూపాయల విలువైన చెక్కులను పార్టీ కార్యాలయంలో అందజేశారు. లబ్ధిదారులు పరిటాల శ్రీరామ్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.... ఎన్టీఆర్ వైద్య సేవలు కొన్ని సందర్భాల్లో అందక చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఉదారంగా సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందిస్తున్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చాలామందికి ఈ సాయం అందిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఈ సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీ సీడ్స్ డైరెక్టర్ కమతం కాటిమయ్య, పట్టణాధ్యక్షుడు పరిశే సుధాకర్, టిడిపి నాయకులు సందా రాఘవ, జింకా పురుషోత్తం, కొత్తపేట ఆది, జింకల రాజన్న, పూజా మొబైల్ సాయి, బొట్టు కృష్ణ, వంట రమేష్, అడ్ర మహేష్, శీలా మూర్తి, రాయపాటి శివ, 40 వార్డు ఇంచార్జ్ అశోక్, మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు.